జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వెలిమలను ముత్తంగిలో, న్యూ ఎంఐజీని భారతి నగర్లో కలపడాన్ని నిరసిస్తూ, వాటిని తెల్లాపూర్ డివిజన్లోనే ఉంచాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ విన్నపాన్ని మన్నించాలని డిమాండ్ చేశారు.