మురారి హైవే పై బిక్షాటన చేసుకుంటున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మృతి
జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వైపుకు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం గండేపల్లి మండలం మురారి హైవేపై అంబేద్కర్ సెంటర్ వద్ద వచ్చేసరికి ఆదివారం రాత్రి 10:45 సమయంలో మహిళను ఢీ కొట్టి వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది. అయితే ఆమెకు తలకు తీవ్రంగా తగలడంతో అక్కడున్న స్థానికులు అంబులెన్స్ సహాయంతో పెద్దాపురం ఆసుపత్రిలో జాయిన్ చేయగా సోమవారం చికిత్స పొందుతూ మరణించిందని అయితే ఆమె వయసు 65-70 సంవత్సరాలు ఉంటాయని అంతేకాకుండా ఆమె లేత వంగ పువ్వు రంగు పై పసుపు తెలుపు డిజైన్లు గల కాటన్ చీరను కట్టుకుని, తిరుపురంగు జాకెట్లు ధరించినట్లు తెలిపారు.