కారంపూడి పరిధిలో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంచార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి
కారంపూడి మండల పరిధిలోని పారిశుద్ధ్య పనులు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి మీడియా కు తెలియజేశారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలందరూ కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తడి చెత్త పొడి చెత్తను కార్మికులకు వేరువేరుగా అందించాలని తెలియజేయడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు