నంద్యాలలో గాలివాన బీభత్సం, నేలకొరిగిన భారీ వృక్షం ,తప్పిన ప్రమాదం
Nandyal Urban, Nandyal | Oct 23, 2025
నంద్యాలలో బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.పలు కాలనీలు జలమయం అయ్యాయి. గురువారం తెల్లవారుజామున నేషనల్ కాలేజ్ సమీపంలో ఓ పెద్ద వృక్షం నేలకూలి రోడ్డుపై అడ్డంగా పడింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. మున్సిపల్ అధికారులు సిబ్బందితో వృక్షాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వర్షంతో నష్టపోతున్నామని మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.