మీకోసం అర్జీదారులకు శాశ్వత పరిష్కారం చూపండి జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ
Ongole Urban, Prakasam | Sep 15, 2025
“మీ కోసం” లో వచ్చే ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక - మీ కోసం” కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశించారు. మీ కోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.