ఒంగోలు నుంచి సింగరాయకొండ లోని పాకాల సముద్రతీరానికి స్పెషల్ బస్సు సర్వీసును ప్రారంభించిన అధికారులు
Ongole Urban, Prakasam | Oct 19, 2025
ఒంగోలు నుంచి సింగరాయకొండ మండలం పాకల బీచ్‌కు ఆర్టీసీ సర్వీస్ బస్సును ఆదివారం కమీషనర్ వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సైతం పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. సరదా సమయాన్ని వెచ్చించేందుకు పాకల బీచ్ అనువైనదిగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్ సర్వీస్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సర్వీస్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.