బాపట్ల నియోజకవర్గంలోని చెరుకుపల్లి సమీపంలో గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నిజాంపట్నం కి చెందిన రామకృష్ణ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనపై స్థానికుల ద్వారా సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. మృతుడు రాంపట్లపాలెం నుండి పిట్టల వారి పాలెం కు వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా పోలీసులు తెలిపారు.