జనగాం: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఎదుట ధర్నా
చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో చేనేత కార్మికులు సోమవారం ఆందోళన చేపట్టారు.ఆర్టీసీ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా చేనేత కార్మికులు మాట్లాడుతూ చేనేత రుణమాఫీని తక్షణమే మాఫీ చేయాలని,నేతన్న భరోసా స్కీమ్ ను వెంటనే ప్రారంభించాలని, చేనేతపై జిఎస్టిని పూర్తిగా తొలగించాలని,50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.చేనేత కార్మికులకు వర్క్ షెడ్ మంజూరు చేయాలని కోరారు.