గుర్రం చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి
సదుం మండలంలోని గుర్రం చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సదుం పోలీసులు సోమవారం తెలిపిన కథనం మేరకు సదుం పీలేరు మార్గంలోని నూనె వాండ్లపల్లి అగ్రహారం రోడ్లో గల తాటిగుంటపాలెం పంచాయతీ చింతల వారి పల్లి వద్ద గల గుర్రం చెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఏదైనా వాహనం డీకొనడం తో మృతి చెందాడా,లేక మరే కారణం ఏమైనా ఉందా అనే కోనంలో విచారిస్తున్నారు.మృతుడి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో మృతుడిని ఎవరైనా గుర్తిస్తే తెలిపాలన్నారు