మద్యానికి బానిసై, భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ అనారోగ్యంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న యువకుడు
మద్యానికి బానిసైన యువకుడు భార్యా పిల్లలకు దూరంగా ఉంటూ అనారోగ్యంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో ఉన్న గొడగల కాలనీలో చోటు చేసుకున్నట్లు సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తెలిపిన వివరాలు ప్రకారం సాలూరు పట్టణంలోని గొడగల వీధికి చెందిన 28 ఏళ్ల జలుమూరు సాయి అనే యువకుడు మద్యానికి బానిసై, అనారోగ్యానికి గురై భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సాయి తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయినట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు.