కార్తీక పౌర్ణమి సందర్భంగా కీసరగుట్ట దేవస్థానంలో రాచకొండ సిపి సుధీర్ బాబు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్సవాలకు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగాలని ఆదేశించారు. సిపితో సిఐలు, ఎస్సైలు సిబ్బంది ఉన్నారు. ఉదయం నుంచే కీసరగుట్ట భక్తులతో కిటకిటలాడగా, భక్తుల సౌకర్యార్థం దేవస్థాన కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.