కొత్తగూడెం: చెంచుపల్లిలోని సీపీఐ మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని
కమ్యూనిజం అజరామరమని మనిషి మనుగడ ఉన్నంతవరకు కమ్యూనిస్టులు ఉంటారని ఈ వందేళ్లపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ అనేక పోరాటాలు త్యాగాలు చేసిందని రాబోయే వందేళ్లు కూడా అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆదివారం ఉదయం 12 గంటలకు చుంచుపల్లి మండలంలోని ఎన్కె నగర్ లో జరిగినటువంటి ఎనిమిదవ మండల మహాసభలో ఆయన పాల్గొన్నారు.