దర్శి: లక్కవరం గ్రామంలో కుక్కలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టిన పంచాయతి అధికారి శ్రీను
Darsi, Prakasam | Oct 18, 2025 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో వీధి కుక్కల బెడదతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలను కరవడానికి వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో పలుమార్లు పంచాయతీ అధికారులకు తెలియజేశారు. స్పందించిన అధికారులు వీధి కుక్కలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. వాటిని తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెట్టడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి శ్రీను తెలిపారు.