సత్యసాయి జిల్లా సిబ్బంది సహకారం మరువలేనిది: ఎస్పీ రత్న
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళుతున్న ఎస్పీ రత్నకు సిబ్బంది ఆదివారం సాయంత్రం వీడ్కోలు పలికారు. జిల్లా నూతన ఎస్పీ సతీష్ కుమార్, అధికారులు ఆమెకి పుష్పగుచ్చాలు అందించారు. జిల్లా శాంతిభద్రతలపై ఆమె చేసిన సేవలను కొనియాడారు. అనంతరం రత్న మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సహాయ సహకారాలు చేశారో నూతన SPకి అలాగే సహాయ సహకారాలు అందించాలన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.