అనంతపురం జిల్లా సింగనమల పాఠశాలలో విద్యార్థులు యదేచ్చగా పారిపోతున్నారు
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండల కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాల విద్యార్థులు పాఠశాల సమయంలో ఏకంగా పాఠశాల గోడలు దూకి పారిపోతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఉపాధ్యాయులు కనీస చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఈ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాఠశాల వదిలి పారిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.