ఉదయగిరి: ఉదయగిరిలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి బైక్ ర్యాలీ
ఉదయగిరిలో UTF ఆధ్వర్యంలో సాయంత్రం రణభేరి బైక్ ర్యాలీ కార్యక్రమం జరిగింది. వైయస్సార్ సర్కిల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి పంచాయతీ బస్టాండ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యా యులకు బోధనేతర పనులు నుంచి విముక్తి కలిగించాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ ద్వారా ప్రమోషన్ కల్పించాలని,12వ పీఆర్సి కమిషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.