దర్శి: దర్శి నియోజకవర్గం లోని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 15వేల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని దర్శి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 నుంచి 25 వేల వరకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతుల కష్టాలను అధికారులు తెలుసుకొని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.