నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ లో గంజాయి కేసుల్లో పట్టుబడిన బైకులు, సెల్ఫోన్ల వేలంలో రూ.3 లక్షల ఆదాయం: సిఐ రఘునాథ్ రెడ్డి
వివిధ గంజాయి కేసుల్లో పట్టుబడ్డ బైకులు, సెల్ఫోన్లను మంగళవారం వేలం వేసినట్లు నారాయణఖేడ్ అబ్కారీ సీఐ ఎన్. రఘునాథ్ రెడ్డి మంగళవారం తెలిపారు. వేలం ద్వారా ఐదు బైకులకు రూ. 2,51,340, ఎనిమిది సెల్ఫోన్లకు రూ. 67,600 చొప్పున మొత్తం ఆదాయం వచ్చినట్లు తెలిపారు. నాలుగు నెలల క్రితం స్వాధీనం చేసుకున్న ఈ వస్తువులకు నిర్వహించిన వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసినట్లు పేర్కొన్నారు.