రేషన్ షాప్ లో మోసానికి సివిల్ సప్లై అధికారులు స్పందించారు. బాలానగర్ ఏఎస్ఓ కళ్యాణ్ నేతృత్వంలో షాపులో తనిఖీలు నిర్వహించారు. రేషన్ బియ్యం పంపిణీలు అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి షాపుకు సంబంధించిన డీలరును సస్పెండ్ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరారు.