నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణానికి చెందిన దూదేకుల హాసిని 51వ జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికై ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె, ఈ నెల 25 నుంచి 28 వరకు పశ్చిమ బెంగాల్లో నిర్వహించనున్న పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొననుంది. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఆమెను అభినందిస్తూ జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.