రాయదుర్గం మండలం పల్లేపల్లిలో గొల్ల బడప్ప (27)అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరు లో నిర్మాణ పనిచేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడు. 3 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఏమిజరిగిందోగానీ మంగళవారం రాత్రి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతుండేవాడని, కడుపునొప్పితో తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి జడక్క ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.