తాడిపత్రిలోని అతి పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం 11వ రోజు అయిన శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గ రామలింగేశ్వర స్వామికి తమలపాకులతో దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. అర్చనలు, అభిషేకాలు వంటి ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.