నారాయణ్‌ఖేడ్: బీదర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించిన ఘటన స్థలాన్ని పరిశీలించిన డిసిసి ప్రధాన కార్యదర్శి
కర్ణాటకలోని బీదర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించిన ఘటన స్థలాన్ని బుధవారం డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించగా తీవ్రంగా గాయపడిన ప్రతాప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శించి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.