సత్తుపల్లి: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సత్తుపల్లిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సత్తుపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూసంపూడి మహేష్ మాట్లాడుతూ.. రైతులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అమలు చేయాలన్నారు. రైతుభరోసా హామీ కింద ఎకరాకు రూ.15 వేలు ప్రతి రైతుకు, అలాగే కౌలు రైతులకు ఇచ్చిన హామీని సైతం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పునురుద్ధరణపై ఇచ్చిన హామీని అమలు చేయాలని డమాండ్ చేశారు.