అమీర్పేట: OU అధికారుల తప్పిదంతో 11 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలను కోల్పోవడం అన్యాయం: BC పొలిటికల్ JAC చైర్మన్ యుగంధర్ గౌడ్
నాంపల్లిలో టిఎస్పిఎస్సి కార్యాలయం వద్ద బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తప్పిదం వల్ల 11 మంది అభ్యర్థులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలను కోల్పోవడం అన్యాయమని అన్నారు. వారికి న్యాయం జరగాలని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మెరిట్ సాధించిన అభ్యర్థులకు న్యాయం జరగాలని ఆయన తెలిపారు.