ఇల్లందు: ఇల్లెందు బస్టాండ్ వద్ద ఘనంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఇల్లందు పట్టణంలో ఘనంగా ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ ఇల్లందు డిపోలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) 47వ ఆవిర్భావ దినోత్సవం కార్మికులుఘనంగా జరుపుకొన్నారు. కొత్త బస్టాండ్ వద్ద జెండావిష్కరణ నిర్వహించారు.అనంతరం జరిగిన కార్యక్రమం లో సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ హాజరై ప్రసంగించారు.ఇల్లందు డిపో ఎస్ డబ్ల్యూ ఎఫ్ (సిఐటీయూ)అధ్యక్షులు కామ్రేడ్ ఐవీ లు అధ్యక్షత వహించారు. సెక్రటరీ జేయు చారి జెండా ఆవిష్కరించాడు.ఇల్లందు డిపో ఎస్ డబ్ల్యూ ఎఫ్ గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.