రాజ్యాంగాన్ని కాపాడాలని గూడూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద MRPS నాయకులు ధర్నా
సుప్రీం కోర్టు జడ్జిపై దాడి చేసిన రాకేశ్ కిషోర్ పై చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగ విలువలను కాపాడాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు తహశీల్దార్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ దేవదాసు, గొల్లపల్లి సిసింద్రీ మాట్లాడుతూ.. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.