మేడ్చల్: కుత్బుల్లాపూర్ లో అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మండలం, దొమ్మర పోచంపల్లి సర్వేనెంబర్ 120 లోని ప్రభుత్వ భూమిలో సుమారు 10,15 అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శనివారం జెసిబి సాయంతో కూల్చివేశారు. గతంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకునే ప్రయత్నించినప్పుడు కొందరు నిర్మాణదారులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని గండి మైసమ్మ, దుండిగల్ మండల తహసిల్దార్ ఎన్.రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.