యర్రగొండపాలెం: పాలుట్ల రహదారిలో ఇరుక్కుపోయిన నాలుగు ట్రాక్టర్లు, అతి కష్టం మీద రేషన్ బియ్యాన్ని పాలుట్లకు చేర్చిన గ్రామస్తులు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో తుఫాన్ వల్ల దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో వరద తాకిడికి పాలుట్ల గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం కొట్టుకొని పోయింది. దీంతో గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్నారు. గ్రామానికి వెళ్లాల్సిన రేషన్ బియ్యం లారీలు పోయే పరిస్థితి లేకపోవడంతో నాలుగు ట్రాక్టర్లతో అధికారులు తరలించారు. మార్గ మధ్యలో ట్రాక్టర్లు వాగులు ఇరుక్కుపోయాయి. అతి కష్టం మీద గ్రామస్తుల సహాయంతో రేషన్ బియ్యాన్ని పాలుట్లకు చేర్చారు.