అనంత జిల్లాలో అర్ధాంతరంగా ముగిసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన
Anantapur Urban, Anantapur | May 16, 2025
అనంతపురం జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు చేరుకున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన శుక్రవారం మధ్యాహ్నం అర్ధాంతరంగా ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా అపాయింట్మెంట్ లభించడంతో ఆయన శుక్రవారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం అనంతపురం నగరంలోని ఎం వై ఆర్ ఫంక్షన్ హాల్ లో తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది.