కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఆలయం హుండీ లెక్కింపును చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి భక్తులు పాల్గొని లెక్కింపు చేపట్టారు. ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగింది. వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాలో జమ చేసినట్టుగా అధికారులు తెలిపారు.