ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలందరూ తమ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి కోరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 36వ డివిజన్ అంబేద్కర్ నగర్లో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ నేత మలిరెడ్డి కోటారెడ్డితో కలసి ఆయన పాల్గొన్న