పులివెందుల: వేంపల్లి రేంజ్ పరిధిలో 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు
Pulivendla, YSR | Oct 28, 2025 ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కడప జిల్లా అటవీశాఖ అధికారి వినీత్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం వేంపల్లి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వేంపల్లి రేంజ్ లోని బోలగుంది చెరువు అటవీ ప్రాంతంలో సీ. గ్రేడ్ కు చెందిన 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అడవిలో కుంబిగ్ చేసే సమయంలో నలుగురు స్మగ్లర్లను గుర్తించామని, అందులో ముగ్గురిని అరెస్టు చేశామని, మరొకరు పారిపోయారని చెప్పారు. ముగ్గురు స్మగ్లర్లతో పాటు ఒక బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.