సిరికొండ: అనంతపూర్ గ్రామంలో బావిలో పడి పదేళ్ల బాలుడి మృతి
సిరికొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అనంతపూర్ గ్రామానికి చెందిన తోడసం నాగు- ఇస్రుబాయి దంపతుల కుమారుడు లాల్ సావ్ (10) శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. శనివారం ఉదయం స్థానికులు గ్రామ పొలిమేరలో గాలించగా బావిలో బాలుడు శవమై కనిపించాడు.దీంతో వారు బాలుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.బాలుడు బావిలో ఎలా పడ్డాడు అనే విషయంపై పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు.