యర్రగొండపాలెం: రసాయనిక ఎరువులపై రైతులకు అవగాహన కల్పించిన ఏవో లక్ష్మీనారాయణ
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో యూరియా కొరత లేదని రైతులు ఎవరు ఇబ్బంది పడవద్దని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రసాయనిక ఎరువులు మరియు సేంద్రియ ఎరువుల పై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను ఉపయోగించాలని తద్వారా మంచి దిగుబడి వస్తుందని రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. పంట సాగుకు సంబంధించిన ఎరువులు రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంటాయన్నారు.