సంగారెడ్డి: నిమ్జ్ కోసం ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేయవద్దు: సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
నిమ్జ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రైతుల నుండి బలవంతపు భూసేకరణ చేయడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డి లోని కలెక్టర్ కార్యాలయం ముందు ఝరాసంగం మండలం ఎల్గోయ్ గ్రామస్తులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం పలికారు. గ్రామంలో 195 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని తెలిపారు. ఎంతో సారవంతమైన బగుల పంటలు పండే భూములను పరిశ్రమల పేరుతో లాక్కోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్, రైతులు ఉన్నారు.