గుంతకల్లు: గుత్తిలోని గుంతకల్ రోడ్డులో రోడ్డుకు అడ్డంగా ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగింపు
గుత్తిలోని గుంతకల్ రోడ్డులో గురువారం ఆక్రమణలను తొలగించారు.ఆర్ అండ్ బీ,నేషనల్ హైవే,మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఆక్రమణలను తొలగిస్తున్నారు.జేసీబీ లతో రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు.గాంధీ సర్కిల్ వద్ద నుంచి గుంతకల్ రోడ్డు లోని బ్రిడ్జి వరకు రోడ్డు వేయనున్నారు.ఈ నేపథ్యంలో రోడ్డు అడ్డంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.రెండు రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.