పులివెందుల: మల్లెల గ్రామం వద్ద అదుపుతప్పి సిమెంట్ లారీ బోల్తా, డ్రైవర్ కు స్వల్ప గాయాలు
Pulivendla, YSR | Sep 21, 2025 కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం మల్లెల గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం లారీ బోల్తాపడింది. ఎర్రగుంట్ల నుంచి బెంగళూరుకు సిమెంట్ తీసుకెళ్తున్న లారీ, మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఒరిగి పడింది. లారీ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు