ఉదయగిరి: వరికుంటపాడు మండలంలో పిల్లపేరు వాగులో పడి శివరాం అనే బాలుడు మృతి
పిల్లాపేరు వాగులో పడి బాలుడి మృతి వరికుంటపాడు మండలం జి కొండారెడ్డిపల్లి పంచాయతీ కొత్తపల్లిలోని పిల్లాపేరు వాగు దాటుతుండగా శాగం శివరాం (15) మృతి చెందాడు. పిల్లా పేరులోని నల్లరాతి మడుగులో గేదెలు మేతకు వెళ్లగా వాటిని తీసుకువచ్చేందుకు శివరాం, గంగిరెడ్డి వెళ్లారు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శివరాంను వాగు అవతల ఉంచి గంగిరెడ్డి వాగు దాటి గేదెలు కోసం వెళ్లారు. ఈ క్రమంలో శివరాం వాగులో పడి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.