విశాఖపట్నం: జులై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగ్గ క్రిమినల్,సివిల్,ప్రీ లిటిగేషన్ కేసులు రాజి చేసుకోవాలన్న జిల్లా జడ్జి రాజు
జులై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరగబోతుందని, ఈ అదాలత్ కు సంబంధించి వాదులు, ప్రతివాదులు, కక్షిదారులు, బ్యాంకింగ్ సెక్టార్ వారు, ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి చిన్నం శెట్టి రాజు మంగళవారం సాయంత్రం పిలుపునిచ్చారు. ఈ లోక్ అదాలత్ జిల్లాలో గల అన్ని కోర్ట్ ల నందు నిర్వహించబడుతుందని రాజీపడ దగ్గ క్రిమినల్, సివిల్ మరియు ప్రీ లిటిగేషన్ కేసులు ను రాజి చేసుకోవాలని పిలుపును ఇచ్చారు.