దర్శి: రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులను వాడాలని ఏవో రాధా రైతులకు పిలుపు
Darsi, Prakasam | Sep 15, 2025 ప్రకాశం జిల్లా దర్శి మండలంలో యూరియా కొరత లేదని మండల వ్యవసాయ అధికారిని రాధా తెలిపారు. రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువులను వాడకుండా సేంద్రియ ఎరువులను వాడడానికి అలవాటు చేసుకోవాలని సూచించారు. రసాయన ఎరువులు వల్ల భూమి సారం తగ్గిపోయి పంట దిగుబడి తగ్గిపోతుంది అన్నారు. సేంద్రియ ఎరువులతో భూమిని సారవంతం చేస్తే దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందని రైతులకు సూచించినట్లు తెలిపారు.