తడ (మం) మాంబట్టు సెజ్ లోని ఇన్ఫీలూమ్ కంపెనీ కార్మికులు ఆందోళన
- 2 ఏళ్ల నుండి జీతాలు సరిగా ఇవ్వడంలేదని వాపోయిన కార్మికులు
తిరుపతి జిల్లా తడ మండలం మాంబట్టు సెజ్ లోని ఇంఫి్లూమ్ కంపెనీలోని కార్మికులకు గత రెండు సంవత్సరాల నుండి జీతాలు సరిగా ఇవ్వడం లేదని కార్మికులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో జులై జూన్ నుండి ఇప్పటివరకు కార్మికులకు జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల జీతాలు అడుగుతుంటే మీకు ఇష్టముంటే పని చేయండి లేదంటే వెళ్లిపోండని హేళనగా మాట్లాడుతున్నారని కార్మికుల వాపోతున్నారు. కంపెనీ లోపల మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మహిళలు తమ ఆవేదన వెలబుచ్చారు. కార్మికులకు చట్టాలు ఉన్న అలాంటి చట్టాలను కంపెనీ యాజమాన్యంకి వర్తించవా అంటూ వారు