మార్కాపురం: మార్కాపురంలోని పూల సుబ్బయ్య కాలనీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మిస్తున్న పది మెడికల్ కాలేజీ లను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేపట్టాలని ప్రకాశం జిల్లా మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు అన్నారు. ఆదివారం మార్కాపురం పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల పేదలు మెరుగైన వైద్య సేవలు కోల్పోతారని అన్న వెంకట రాంబాబు అన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి హాజరయ్యారు.