కంబదూరు మండలం వంటారెడ్డిపల్లిలో బుధవారం పెద్దమ్మ జాతరను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలు ఊరేగింపు నిర్వహించారు. కంబదూరు మండలం నుంచి కాకుండా చుట్టుపక్కల మండలాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. గ్రామంలో ఎక్కడ చూసినా సందడి, కోలాహలమే కనిపించింది. పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.