ప్రజలను కార్యాలయాలు చుట్టూ తిప్పుకోవద్దు : జాయింట్ కలెక్టర్ కార్తీక్
పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను అనవసరంగా పదేపదే తిప్పుకోవద్దని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆదేశించారు. నిర్ణీత సమయంలోపే వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులకు వాటిని బదిలీ చేశారు. భూసమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు