ఎచ్చెర్ల: లావేరు మండలం ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు
ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు వైద్య సిబ్బందికి సూచించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా ఆసపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు ఆసుపత్రిలో రోగులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.