హై వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడ్డ ప్రజలు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఆదివారం హై వోల్టేజీ రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ఇళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. ఒక్కసారిగా విద్యుత్తు హై వోల్టేజీ రావడంతో పెద్ద శబ్దంతో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయని, లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. విద్యుత్ అధికారులు స్పందించి హై వోల్టేజ్ ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.