కూనవరం: పంచాయతీ నిధులు అవినీతిపై దర్యాప్తు చేయాలి: ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను
చింతూరు డివిజన్లో కూనవరం పంచాయతీలో నిధుల వినియోగంపై అధికారులు దర్యాప్తు జరగాలంటూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీసు డిమాండ్ చేశారు.సోమవారం కూనవరం మండలం టేకులబోరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో సర్పంచ్ మృతి తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా గిరిజనేతరుడికి సర్పంచ్ పదవి ఇచ్చారని అన్నారు. వెటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా, చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు.