కొత్తపల్లి లో భారీ వర్షం, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారులు సూచన
కాకినాడ జిల్లా యూ. కొత్తపల్లి మండలం కొత్తపల్లి తీర ప్రాంతంలో మంగళవారం ఉదయం 10 గంటలకు కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. సముద్రపు అలల తాకిడిని నివారించేందుకు నిర్మిస్తున్న గట్టు పనులకు వర్షం ఆటంకం కలిగిస్తోంది. బీచ్ రోడ్డును మూసివేసి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదకర పరిస్థితులున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.