కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాల నుంచి భారీగా అనంతపురం తరలి వెళ్లిన ఆర్డీటీ లబ్ధిదారులు, ప్రజా సంఘాల సభ్యులు
కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాల నుంచి ఆర్డీటీ లబ్ధిదారులు, ప్రజా సంఘాల సభ్యులు, దళిత సంఘాల సభ్యులు సోమవారం అనంతపురం కు భారీగా తరలి వెళ్లారు. అనంతపురంలో ఆర్డీటీ పరిరక్షణ కోసం చేపట్టిన ధర్నా కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు. కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ ఆస్పత్రి వద్ద నుంచి వాహనాల్లో తరలి వెళ్లారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ను పరిరక్షించేంతవరకు ఉద్యమిస్తామన్నారు.